కోవాగ్జిన్ వ్యాక్సిన్..అమెరికా ఎంట్రీకి నో ప్రాబ్లం!

Update: 2021-06-15 11:05 GMT

కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద ఊర‌ట‌. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు అమెరికాలో ప్ర‌వేశానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇటీవ‌ల వ‌ర‌కూ చాలా దేశాలు కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ఇంకా డబ్ల్యూహెచ్ వో గుర్తింపు పొందిన జాబితాలో లేక‌పోవ‌టంతో అనుమ‌తి నిరాక‌రిస్తున్నాయి. తాజాగా కోవాగ్జిన్‌ తీసుకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థుల‌కు పెద్ద ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది. భార‌త్ లో చాలా మంది కోవిషీల్డ్ , కోవాగ్జిన్ వ్యాక్సిన్లు తీసుకున్న విష‌యం తెలిసిందే.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను హైద‌రాబాద్ కు చెందిన భార‌త్ బ‌యోటెక్ డెవ‌ల‌ప్ చేసిన విష‌యం తెలిసిందే. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు. యితే డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు లేని వ్యాక్సిన్‌ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో "అన్‌వాక్సినేటెడ్" గానే పరిగణిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే డ‌బ్ల్యూహెచ్ వో గుర్తింపు కూడా ల‌భిస్తుంద‌ని..దీనికి అవ‌స‌ర‌మైన డేటాను అంద‌జేసిన‌ట్లు కొద్ది రోజుల క్రితం భార‌త్ బ‌యోటెక్ తెలిపింది.

Tags:    

Similar News