ఎయిర్ బస్...బోయింగ్ లకు బిగ్ డీల్

Update: 2023-02-15 06:56 GMT

Full Viewదేశ విమానయాన చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్. అంతే కాదు పదిహేడు సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా ఒకే సారి ఏకంగా 470 విమానాల కొనుగోలు చేయటానికి ఆర్డర్ ఇచ్చింది. ఈ డీల్ మొత్తం విలువ ఆరున్నర లక్షల కోట్లు కావటం సంచలనం. ఇందులో ఫ్రాన్సుకు చెందిన ఎయిర్ బస్ 250 విమానాలు...అమెరికాకు చెందిన బోయింగ్ 220 విమానాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిలో విదేశీ గమ్య స్థానాలకు చేర్చే వైడ్ బాడీ విమానాలతో పాటు ఏ 350 విమానాలతో పాటు 210 నారో బాడీ విమానాలు కూడా ఉన్నాయి.

                               ఎయిర్ బస్ తో ఒప్పందం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యూల్ మక్రాన్ కూడా పాల్గొన్నారు. కొత్త ఆర్డర్స్ కు సంబంధించి తొలి విమానం ఈ ఏడాది చివరిలో అందనుంది.. ఎక్కువ శాతం విమానాలు 2025 నుంచి ఎయిర్ ఇండియా చేతికి వస్తాయి. బోయింగ్ నుంచి 220 విమానాలు కొనుగొలు చేయాలన్న ఎయిర్ ఇండియా నిర్ణయంపై అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ డీల్ వల్ల పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

Tags:    

Similar News