డిస్కౌంట్ ధరకే లిస్టింగ్

Update: 2024-11-04 05:35 GMT

ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ కూడా ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిలిచింది. ఈ కంపెనీ షేర్లు సోమవారం నాడు బిఎస్ఈ, ఎన్ ఎస్ఈ లో నమోదు అయ్యాయి. ఊహించినట్లుగానే ఈ కంపెనీ షేర్లు కూడా ఆఫర్ ధర కంటే దిగువనే లిస్ట్ అయ్యాయి. ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక్కో షేర్ ను 463 రూపాయల లెక్కన ఇన్వెస్టర్లకు జారీ చేసింది. కానీ లిస్టింగ్ మాత్రం ఆఫర్ ధర కంటే ఎనిమిది శాతం డిస్కౌంట్ తో 426 రూపాయల వద్ద నమోదు అయింది. అయితే తర్వాత ఉదయం పదకొండు గంటల సమయం వరకు కంపెనీ షేర్ చేరిన గరిష్ట ధర అంటే 462 రూపాయలు మాత్రమే. షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి 5430 కోట్ల రూపాయలు సమీకరించింది.

                                           ఈ కంపెనీ భారత్ తో పాటు పలు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ లు చేపడుతోంది. కంపెనీ ఆర్డర్ బుక్ పొజిషన్ ఎంతో మెరుగ్గా ఉంది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది అని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీర్ఘ కాలంలో మాత్రం ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది అని పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు చెపుతున్నాయి. ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ రోజే మార్కెట్ లు భారీగా పఠనం అవటంతో ఆ ప్రభావం కంపెనీ షేర్లపై కూడా పడింది అని చెప్పొచ్చు. బిఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో 1200 పాయింట్ల నష్టంతో 78515 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Tags:    

Similar News