500 మందితో సోషల్ మీడియా టీం లు కూడా ..ఇళ్ల స్థలాల విషయంలో కెసిఆర్ మోసంతో ఈ నిర్ణయం!
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే కొంత మంది జర్నలిస్ట్ లు సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల సమావేశం అయిన వీళ్ళు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు అయన మొత్తం క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కరిపై పది మంది జర్నలిస్టులు పోటీకి సిద్ధం అవుతున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రాధమికంగా 200 మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. కెసిఆర్ తో కలుపుకుని ప్రస్తుతం క్యాబినెట్ లో 17 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కొక్కరిపై పది మంది అంటే 170 మంది సరిపోతారు. సేఫ్ సైడ్ గా 200 మంది తో పేర్లు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఆరు నెలల సమయం ఉన్నందున ఇప్పటినుంచే పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. ఇక్కడ గెలుపు ఓటముల కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ పలు మార్లు మీడియా సాక్షిగా ప్రకటనలు చేసి..సుప్రీంకోర్ట్ కేసు కేసు క్లియర్ చేసిన తర్వాత కనీసం దీనిపై మాట మాట్లాడక పోవటం..ప్రస్తుతం ఉన్న సొసైటీ లో అయన ఫ్యామిలీ పత్రిక నమస్తే తెలంగాణతో పాటు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి, ఆంధ్ర ప్రభ, వార్త, హిందూ, టైమ్స్ అఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , హన్స్ ఇండియా తో పాటు అన్ని కీలక టీవీల ప్రతినిధులు ఉన్నా కూడా సీఎం కెసిఆర్ ఈ విషయం గత ఎనిమిది నెలలుగా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో సభ్యులు కొంత మంది ఇటీవల సమావేశం అయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నిత్యం విధుల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లతో కలిసే వారి విషయంలోనే సీఎం కెసిఆర్ ఇలా ఉంటే ఇక ప్రజల విషయంలో ఎలా ఉంటారు అనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
ఇదేదో వ్యక్తుల సొంత సమస్య కూడా కాదు...డబ్బులు కట్టి దశాబ్దాలు గడిచినా ...కేటాయించిన స్థలం విషయంలోనే కెసిఆర్ ఇంత దారుణంగా వ్యవహరించడంపై జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెసిఆర్, అయన క్యాబినెట్ మొత్తంపై పోటీ తో పాటు మరో 500 మంది తో సోషల్ మీడియా టీంలు గా ఏర్పడాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటిరెండు పత్రికలు తప్ప ప్రభుత్వంలో జరిగే స్కాం లు..ఇతర అక్రమాలు కూడా పెద్దగా బయటకు రావటం లేదు. దీంతో కొత్తగా ఏర్పడే సోషల్ మీడియా టీం కు పలు ప్రధాన టీవీలు , పత్రికల్లో పనిచేసే వాళ్ళు కూడా తెర వెనక ఉండి సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లు కీలక పాత్ర పోషించటానికి రెడీ అయితే...ప్రధాన మీడియా, టీవీల ప్రతినిదులు వారికి సమాచారం ఇవ్వనున్నారు. ఈ మొత్తం ఏ పార్టీ వాడుకుంటుంది...ఎవరు ఉపయోగించుకుంటారు అనే విషయం తో సంబంధం లేకుండా ఈ పని చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా పూర్తి అయినట్లు సమాచారం. చూడాలి మరి ఈ వ్యవహారం ఎలా వెళుతుందో.కెసిఆర్ సర్కారు జర్నలిస్ట్ లకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియ చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.