తేజస్వి యాదవ్ ముందు జాగ్రత్తలు

Update: 2020-11-09 07:08 GMT

బీహర్ భవిష్యత్ రాజకీయాలకు మంగళవారం బిగ్ డే. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో తేలేది రేపే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకగ్రీవంగా మహాకూటమి వైపే మొగ్గుచూపాయి. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇదే జరిగితే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. మోడీ, నితీష్ కుమార్ లను డీకొట్టి అధికార పీఠం దక్కించుకుంటే మాత్రం దేశ రాజకీయాల్లో ఇది ఓ పెద్ద సంచలనంగా మారుతుంది. అందుకే దేశం అంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యర్ధులు కాచుకుని కూర్చున్నారు. ఈ తరుణంలో తేజస్వి యాదవ్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా ఓట్ల కౌంటింగ్‌ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, క్రమ శిక్షణగా మెలగాలని చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బాణాసంచా కాల్చడం, రంగులు పూసుకోవడం, ప్రతిపక్ష పార్టీ వారితో రౌడీ చేష్టలు పనికిరావని అన్నారు బీహార్‌ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (నవంబర్‌ 10) ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags:    

Similar News