కొత్త భార‌త్..చైనా నిర్బ‌ర్

Update: 2022-02-09 06:32 GMT

ప్ర‌ధాని మోడీ కొద్ది కాలం క్రితం దిగుమ‌తులు త‌గ్గించి అన్ని వ‌స్తువులు భార‌త్ లోనే త‌యారు చేసేందుకు వీలుగా ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నినాదం తీసుకొచ్చారు. స్వయం సమృద్ధి సాధించ‌ట‌మే ల‌జ్ఞ్యంగా ఈ నినాదం ప్ర‌క‌టించారు. తాజాగా ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ హైద‌రాబాద్ లోని ముచ్చింతాలతో రామానుచార్యకు సంబంధించిన స‌మాన‌త్వ ప్ర‌తిమ‌ను ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ విగ్ర‌హాన్ని చైనాలో త‌యారు చేశారు.

ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తావిస్తూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని చైనాలో త‌యారు చేశార‌ని..కొత్త భార‌త్ ..చైనా నిర్భ‌ర్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం నాడు ట్వీట్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని గ‌తంలో లేవ‌నెత్తారు. ఓ వైపు ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అంటూ చైనాలో త‌యారు చేసిన విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేందుకు ప్ర‌ధాని మోడీ ఎలా వ‌స్తార‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. 

Tags:    

Similar News