మాస్క్ అప్...అమెరికా

Update: 2021-01-21 04:14 GMT

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ నినాదం ఇది. మాస్క్ లు ధరించటం పక్షపాతంతో చూస్తున్నట్లు కాదని..ఇది దేశభక్తిని పెంచే అంశం అన్నారు. మాస్క్ లు ధరించటం ద్వారా లెక్కలేనన్ని జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అందుకే తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు తెలిపారు. ఫెడరల్ ప్రాపర్టీలో మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అమెరినాను మాస్క్..అప్ చేయాల్సిన సమయం ఇదేనన్నారు.

మొదటి నుంచి జో బైడెన్ విధిగా మాస్క్ లు ధరించాలని చెబుతూ వస్తుంటే...మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మాస్క్ పెట్టుకోనని వ్యాఖ్యానించి కలకలం రేపారు. చెప్పినట్లే బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ లేకుండానే దర్శనం ఇచ్చి విమర్శల పాలు అయ్యారు. కరోనా కట్టడికి కూడా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని జో బైడెన్ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Tags:    

Similar News