అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ

Update: 2020-11-23 08:16 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎంఐఎంకు తిరుగుండదు అనుకునే పాత బస్తీలోనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వరద సాయం తమకు అందలేదని కొంత మంది మహిళలు అసదుద్దీన్ ఓవైసీని నిలదీశారు. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్ధికి ఓటు వేయాలని కోరుతూ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం నాడు ప్రచారం నిర్వహించారు.

ఆ సమయంలోనే ఆ ఘటన జరిగింది. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వస్తారా అంటూ మహిళలు ప్రశ్నల వర్షం కురిపించటంతో..అసదుద్దీన్ ఆ మహిళలకు సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎంఐఎం సొంతంగా 52 సీట్లలో పోటీచేస్తోందని తెలిపారు. ఓ వైపు బిజెపి మాత్రం టీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపిస్తోంది.

Tags:    

Similar News