కొత్త కాన్సెప్ట్ కిరణ్ అబ్బవరానికి కలిసొచ్చిందా?

Update: 2023-02-18 07:53 GMT

Full Viewపక్క పక్క ఇళ్ల వాళ్ళు ఉంటారు. పక్క పక్క ఆఫీస్ ల వాళ్ళూ ఉంటారు. కానీ పక్క పక్క ఫోన్ నంబర్లు..అదే నెంబర్ నైబర్. ఈ కాన్సెప్ట్ వినటానికి చాలా కొత్తగా ఉంది. ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే వినరో భాగ్యం విష్ణుకథ. మరి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో ..ఎవరూ టచ్ చేయని సబ్జెక్టు తో సినిమాను నడిపించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి చాలా వరకూ విజయవంతం అయ్యారు అనే చెప్పాలి. గత కొంత కాలంగా సరైన హిట్ దక్కక హీరో కిరణ్ సబ్బవరం కొంత ఒత్తిడిలో ఉన్నారు. ఈ తరుణంలో అల్లు అరవింద్, బన్నీ వాసు ల బ్యానర్ పై సినిమా అంటే సహజంగా అంచనాలు ఒకింత పెరుగుతాయి. చిత్ర యూనిట్ ముందే చెప్పిన కాన్సెప్ట్..టీజర్, ట్రైలర్ లు కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతులు ఇచ్చాయని చెప్పొచ్చు. శివరాత్రి సందర్భంగా శనివారం నాడు ఈ సినిమా విడుదల అయింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే నెంబర్ నైబర్ కాన్సెప్ట్ కు తోడు గ్యాంగ్ స్టర్స్ ఒక టార్గెట్ తో హైదరాబాద్ చేరుకోవటం..అసలు వాళ్ళు ఏ ప్లాన్ తో హైదరాబాద్ వచ్చారు...వాళ్ళను పట్టుకునేందుకు ఎన్ఐఏ టీం చేసే ప్రయత్నాలు....ఎన్ఐఏ టీం కు విష్ణు ఎలా సాయపడతాడు. ఎవరిని అయితే పట్టుకోవటానికి వచ్చాడో వాళ్ళకే తన మొత్తం కథ చెప్పటం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో కిరణ్, హీరోయిన్ కాశ్మీర పరదేశి లు నెంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారానే కలుసుకుని ప్రేమలో పడతారు. ఇదే టీం లో ఉండే మురళీ శర్మ , హీరోయిన్ లు యూట్యూబ్ లో పాపులర్ కావటానికి చేసే వీడియోలు...రీల్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి.

                                    తన వీడియో సెన్సేషన్ చేయటం కోసం ఫ్రెండ్ గా ఉన్న మురళి శర్మ లైవ్ మర్డర్ కు ప్లాన్ చేస్తుంది. అది డమ్మి తుపాకీతో చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ డమ్మి తుపాకీ ప్లేస్ లో ఒరిజినల్ తుపాకీ రావటం..నిజంగానే మురళి శర్మ మర్డర్ తో హీరోయిన్ ను పోలీస్ లు అరెస్ట్ చేయటం సినిమాలో కీలక సన్నివేశాలు. అసలు ఈ మర్డర్ విషయం లో ఏమి జరిగింది..మరి హీరోయిన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చింది అన్నదే సినిమా. ఈ సినిమాలో కావాల్సినన్ని ట్విస్టులు ...ఆకట్టుకునే డైలాగులు ఉన్నాయి. సన్నివేశాలకు అనుగుణంగా చైతన్ భరద్వాజ్ మంచి బ్యాక్ రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలు చాలా పరిమితమే అని చెప్పొచ్చు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని క్లైమాక్స్ లో చూపించారు. వినరో భాగ్యము విష్ణుకథ ద్వారా కిరణ్ సబ్బవరం హిట్ కొట్టారని చెప్పొచ్చు. కాకపోతే సినిమా కొన్నిసార్లు మరి స్లో గా ఉండటం కొంత మైనస్ గా ఉంది. సినిమాలో హై లైట్ అంటే కాన్సెప్ట్...కథ నడిపించిన విధానం..

రేటింగ్: 3 /5

Tags:    

Similar News