'సీటీమార్' మూవీ రివ్యూ

Update: 2021-09-10 07:52 GMT

గోపీచంద్ కు కాలం క‌లసిరావ‌టం లేదు. అది ఆయ‌న క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్పా?. లేక ఆయ‌నే ఏదో ఒక సినిమా చేద్దాంలే అనుకుంటున్నారా? అనే విష‌యమే తేలాల్సి ఉంది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌లైన 'సీటీమార్' సినిమా చూసిన వారెవ‌రికైనా ఇదే సందేహం రావ‌టంలో ఖాయం. ఒక్క మాట‌లో చెప్పాలంటే 'క‌బ‌డ్డీ' పేరుతో సినిమాలో 'హింస‌' సాగింది. సీటిమార్ సినిమాలో క‌బ‌డ్డీ త‌క్కువ హింస ఎక్కువ‌. స్కూల్ కోసం ఆట‌. స్కూల్ ను కాపాడుకునేందుకు ఆట‌. అమ్మాయిల‌ను క‌బ‌డ్డీ ఆట‌కు పంపించ‌టానికి ఒప్పుకోని త‌ల్లిదండ్రులు..వాళ్ళ‌ను మోటివేట్ చేసి ఒప్పించే కోచ్ పాత్ర‌లో గోపీచంద్. స్కూల్ కోసం గేమ్ కాన్సెప్ట్ ఇప్ప‌టికే చాలా సినిమాల్లో చూసిందే. పోనీ క‌థ‌నంలో ఏమైనా కొత్త‌ద‌నం ఉందా అంటే అదీ లేదు. సినిమా ప్రారంభం నుంచే భ‌యంక‌ర‌మైన హింస‌ను చూపించ‌టం ద్వారా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది సినిమా ఎలా ఉండ‌బోతుందో సంకేతాలు ఇచ్చారు.

పోలీసు అధికారే మాఫియాగా మార‌టం..పైగా ఉన్న‌తాధికారులను సైతం లెక్క చేయ‌కుండా వ్య‌వ‌హ‌రించటం. ఇదీ సినిమా. హీరోయిన్ త‌మ‌న్నా ఎంట్రీ కూడా సినిమా స‌గం అయిపోయిన త‌ర్వాతే ఉంటుంది. ఆంధ్రా, తెలంగాణ క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ టీమ్ ల‌ మ‌ధ్య జ‌రిగే టీజింగ్ కూడా ఏ మాత్రం ఆక‌ట్టుకునేలా ఉండ‌దు. కొన్ని సినిమాలు ఏదో ఒక స‌గ భాగం అయినా కొంత‌లో కొంత ప‌ర్వాలేదు అన్పిస్తాయి. కానీ సీటిమార్ సినిమా మాత్రం ఆ ఫీల్ ఏ ద‌శ‌లో ఇవ్వ‌దు. కాస్తో కూస్తో సినిమాలో రావు ర‌మేష్ డైలాగ్ లే సీటిమార్ కోసం థియేట‌ర్ లోకి వెళ్లిన ప్రేక్షకుల‌కు కొంత‌లో కొంత ఊర‌టనిస్తాయి. తెలంగాణ కోచ్ గా న‌టించిన త‌మ‌న్నాతో చెప్పించిన డైలాగ్ లు కూడా ఏ మాత్రం క‌నెక్టింగ్ గా ఉండ‌వు. ఓవ‌రాల్ గా చూస్తే 'సీటీమార్' లో ఏ మాత్రం 'సౌండ్' లేదు.

రేటింగ్. 2\5

Tags:    

Similar News