ఈ మధ్య కాలంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు సరైన హిట్ దక్కలేదు. చేసిన సినిమాలు అన్ని ఏదో సో సో గానే నడిచి వెళ్లిపోతున్నాయి. తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్ పై ఈ సారి నాగార్జున కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందులో భాగంగానే సంక్రాంతి సీజన్ లో చివరి సినిమాగా నా సామిరంగ ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కావటానికి మలయాళం రీమేక్ సినిమా అయినా..తెలుగు ప్రేక్షకులు..ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఉండాల్సిన దినుసులు అన్ని దట్టించిన సినిమాగా ఇది విడుదల అయింది. అయితే ఈ సినిమా కథ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఎన్నో సార్లు చూసిన సినిమాల్లో కథే ఇక్కడ కూడా కనపడుతుంది. కథ విషయంలో ఎక్కడా పెద్దగా కొత్తదనం కనిపించదు. అయితే పండగ సినిమా కావటం తో ఇదే టార్గెట్ గా కథ నడిపించారు. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.
నాగార్జునతో పాటు ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ లు కీలక పాత్రలు పోషించారు.రాజ్ తరుణ్ కంటే అల్లరి నరేష్ పాత్ర కీలకంగా ఉంది. నరేష్ కు జోడిగా మిర్న మీనన్ కనిపిస్తే..రాజ్ తరుణ్ ప్రియురాలిగా రుక్సర్ దిల్లన్ సందడి చేస్తుంది. ఈ తరహా పాత్రలు నాగార్జున కు కొట్టిన పిండి కావటం తో అలవోకగా చేసుకుంటూ పోయాడు. నా సామిరంగ సినిమా లో ప్రదానం గా ఎవరి గురించి అయిన చెప్పుకోవాలంటే అది హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించే. సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించటం తో పాటు తన నటన తో ఆకట్టుకుంటుంది. నాగార్జున, అషిక జోడీ బాగుంది. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని నాగార్జున పాత్ర డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఒక ఫైట్ లో సైకిల్ చైన్ తో శివ సినిమాను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు విజయ్ బిన్నీ.ఈ సినిమాలో ఇతర కీలక పాత్ర ల్లో నాజర్, రావు రమేష్, మహేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.మొత్తం మీద చూస్తే నా సామిరంగ ఒక టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు.