దర్శకత్వం వహించటమే కాకుండా ఇందులో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు కూడా. హీరో చైతన్య రావు ఒక విచిత్రమైన సమస్యతో బాధ పడుతుంటాడు. ఒక మాట మాట్లాడాలంటే నోట్లో నుంచి విచిత్ర శబ్దాలు వస్తాయి. చైతన్య రావు తాత పాత్రలో బ్రహ్మనందం నటించాడు. ఒక కంపెనీలో ఉద్యోగ్యం చేసే చైతన్య రావు ఒక డెమో బొమ్మను డ్యామేజ్ చేయటం..దీనికి కోటి రూపాయలు కట్టాలని వ్యవహారం కోర్ట్ కు ఎక్కటం వంటి ఘటనలతో సినిమా విచిత్రంగా సాగుతుంది. ఈ కేసు వాదించే లాయర్ పాత్రలో రాగ్ మయూర్ డైలాగులు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. ఇతర కీలక పాత్రల్లో జీవన్, గెటప్ శీను, విష్ణులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా కథకు అనుగుణంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సార్లు రోడ్లపై కుక్కలను చూస్తుంటే తనకు అసూయ కలుగుతుంది అని..ఎందుకంటే ఎలాంటి టెన్షన్ లు లేకున్నా అవి బతుకుతాయి అని చెపుతాడు తరుణ్ భాస్కర్. డబ్బు ఉన్న వాడు..లేని వాడు కూడా ఇంకా ఇంకా పెద్దగా కావాలి అని కోరుకుంటారు తప్ప ఎక్కడా సంతృప్తి పడరు అని..స్వేచ్ఛ, సంతోషం జేబులో ఉన్న డబ్బు ఇవ్వదు అని...జేబు వెనక ఉన్న హృదయం ఇస్తుంది అంటూ సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కీడా కోలా ఒక టైం పాస్ సినిమా.
రేటింగ్: 2 .75 \5