'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ రివ్యూ

Update: 2022-11-25 07:59 GMT

అల్లరి నరేష్. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. చాలాకాలం అయన సినిమాలు అన్ని కామెడీ వెంటే పరుగెత్తేవి. ఇప్పుడు అల్లరి నరేష్ రూట్ మార్చాడు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో అయినా..తాను హీరో గా నటించిన నాంది సినిమాలో కూడా సీరియస్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు . ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా డ్రై సబ్జెక్టును తీసుకుని దర్శకుడు ఏ ఆర్ మోహన్ పెద్ద సాహసమే చేశారు అని చెప్పొచ్చు. సినిమా అంతా కూడా మారేడుమిల్లి అనే ఊరు చుట్టూ. అక్కడి సమస్యల చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ఫోకస్ పెట్టిన అంశాలు చాలా సార్లు పత్రికల్లో వచ్చినవే. కానీ సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా కూడా ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ కొట్టకుండా చేయటంలో దర్శకుడు విజయవంత అయ్యారు.. అల్లరి నరేష్ కు జోడిగా ఆనంది నటించింది.

                                          ఈ సినిమాలో హైలైట్ అంటే వెన్నెల కిషోర్ కామెడీ అని చెప్పుకోవాలి. ఇద్దరు టీచర్లు ఎన్నికల నిర్వహణకు మారేడుమిల్లి అనే గ్రామం వెళ్లగా..వాళ్లకు అక్కడ ఎదురైన పరిస్థితులే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఏమైనా తేడా కొడుతుందా అన్న సందేహం రావటం సహజం, కానీ ఒక చిన్న కథను ట్విస్టుల మీద ట్విస్టుల తో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశారు. దీంతో అల్లరి నరేష్ కు మరో హిట్ సినిమా వచ్చినట్లు అయింది. సినిమా అంతా కీలక పాత్రలు అయిన అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, ఆనంది, ప్రవీణ్ ల చుట్టూనే తిరుగుంది. అయినా సంపత్ రాజ్, శ్రీతేజ్ లు తమ తమ పాత్రలతో సినిమా విజయంలో కీలక భూమిక పోషించారు. చాలా సింపుల్ లైన్ ను...అది కూడా సీరియస్ సబ్జెక్టు ను దర్శకుడు ఏ ఆర్ మోహన్ విజయవంతంగా నడిపించారు. కామెడీ కూడా ఎక్కడా కూడా కావాలని పెట్టినట్లు కాకుండా కధలో భాగంగానే పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. ఇదే ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు.

                                                                                                                                                                                                          రేటింగ్: 3 5

Tags:    

Similar News