మళ్ళీ అదే మోడల్ (Viswam Movie Review)

Update: 2024-10-11 09:46 GMT

Full Viewహీరో గోపి చంద్ కు హిట్ లేక చాలా కాలమే అయింది. దర్శకుడు శ్రీను వైట్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చెప్పట్టారు. శ్రీను వైట్ల , గోపి చంద్ కాంబినేషన్ కావటంతో విశ్వం సినిమాపై ఒకింత అంచనాలు ఏర్పడ్డాయి. విచిత్రం ఏమిటి అంటే గోపి చంద్ తరహాలోనే దర్శకుడు శ్రీను వైట్ల గత సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది అనే చెప్పాలి. మరో వైపు ఈ సినిమాలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కించుకొని కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన విశ్వం సినిమా దసరా పండగ టార్గెట్ గా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

                                                                                                                 విశ్వం సినిమా చూసిన తర్వాత అటు హీరో గోపి చంద్ కానీ..ఇటు దర్శకుడు శ్రీను వైట్ల గత వైఫల్యాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. అసలు సినిమా క్లైమాక్స్ వరకు కూడా హీరో గోపి చంద్ అసలు ఎవరు అనే విషయం ఎవరికి అర్ధం కాదు. మరో వైపు హీరో గోపి చంద్, హీరోయిన్ కావ్యా థాపర్ ల లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు గోపి చంద్ గత సినిమాలు అన్నిటిని కలిపి మళ్ళీ ఇప్పుడు విశ్వం సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది తప్ప ఈ సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. కామెడీ..యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించిన కూడా వెన్నెల కిషోర్, పృద్విల కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

                                                                               వెన్నెల కిషోర్ తో దర్శకుడు శ్రీను వైట్ల ఒక వెరైటీ ట్రైన్ ఎపిసోడ్ ను బిల్డ్ అప్ చేసినా అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఉండటానికి విశ్వం సినిమాలో చాలా మంది నటులు ఉన్నా కూడా కథ లో కొత్తదనం లేకపోవటం వల్ల పెద్దగా ఇంప్యాక్ట్ చూపించావు. విశ్వం సినిమాలో జిషు సేన్‌గుప్తా , సునీల్, సుమన్ ల పాత్రలు కూడా రొటీన్గానే ఉన్నాయి. కాస్తో కూస్తో ఈ సినిమాలో నవ్వించింది ..డైనమిక్ గా ఉంది అంటే నరేష్ , ప్రగతి పాత్రలే అని చెప్పొచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, అజయ్ ఘోష్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. నిర్మాణ సంస్థ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఇటలీ లోని మిలాన్ వంటి లొకేషన్స్ తో పాటు విదేశాల్లో షూటింగ్ చేసినా ఇది సినిమా కు పెద్దగా ఉపయోగపడలేదు అనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే విశ్వం సినిమా మరో సారి అటు హీరో గోపి చంద్ తో పాటు దర్శకుడు శ్రీను వైట్ల కు నిరాశనే మిగిలిచింది అని చెప్పాలి.

                                                                                                                                                                                                              రేటింగ్: 2 .25 /5  

Tags:    

Similar News