'ఎనిమి' మూవీ రివ్యూ

Update: 2021-11-04 10:06 GMT

అంచ‌నాలు లేకుండా సినిమాకెళితే కొన్నిసార్లు ఆశ్చ‌ర్య‌పోవాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌మిళ సినిమాల విష‌యంలోనే జ‌రుగుతుంది. అలాంటిదే ఎనిమీ సినిమా కూడా. త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుద‌లైంది. ఆనంద్ శంక‌ర్ క‌థ అందించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమానే ఇది. ఈ సినిమా దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా మృణాళిని ర‌వి న‌టించ‌గా..ఆర్య‌కు జోడీగా మ‌మ‌తా మోహ‌న్ దాస్ న‌టించింది. ఇక సినిమా అసలు క‌థ విష‌యానికి వ‌స్తే ప్ర‌కాష్ రాజ్ రిటైర్డ్ సీబీఐ ఆఫీస‌ర్. త‌న కొడుకును కూడా పోలీస్ ఆఫీస‌ర్ ను చేయాలనే ఉద్దేశంతోనే చిన్న‌ప్ప‌టి నుంచి ఆ దిశ‌గా శిక్షణ ఇస్తాడు. ఇది చూపి ప‌క్క ఇంట్లో ఉండే విశాల్ కూడా ఆయ‌న ద‌గ్గ‌ర శిక్షణ తీసుకుంటాడు. అయితే త‌న కొడుకు కంటే ప‌క్క‌నుండే కుర్రాడు మ‌రింత షార్ప్ ఉండ‌టం గ‌మ‌నించి పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరితే విశాల్ త‌న‌ కొడుకు కంటే మంచి ర్యాంక్ సాధిస్తాడ‌ని చెబుతాడు. రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు అక్క‌డ గ‌మ‌నించిన అంశాల‌ను చెప్ప‌మ‌న్న‌ప్పుడు విశాల్ చెప్పిన వివ‌రాల‌తో షాక్ అవుతాడు ప్ర‌కాష్ రాజ్. వీళ్ళిద్ద‌రూ పెరిగి పెద్ద‌య్యాక క‌థ అంతా సింగపూర్ కు చేరుతుంది.

సింగపూర్‌లో ఉండే లిటిల్‌ ఇండియా ప్రాంతంలో విశాల్ త‌న తండ్రి న‌డిపే డిపార్ట‌మెంటల్ స్టోర్ లో ప‌నిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. త‌న తండ్రిని చంపి అక్క‌డ నుంచి విదేశాల‌కు వెళ్లిన ఆర్య కాంట్రాక్ట్ కిల్ల‌ర్ గా మార‌తాడు. హై ఫ్రొపైల్ ఉన్న వ్య‌క్తుల‌ను హ‌త్య చేస్తూ ఎవ‌రికి చిక్క‌కుండా తిరుగుతాడు. మ‌రి చిన్న‌ప్ప‌టి స్నేహితులు సింగ‌పూర్ లో ఎక్క‌డ.. ఎలా క‌లుసుకున్నారు. ఒక‌ప్ప‌టి స్నేహితులు బ‌ద్ధ శ‌త్రువులుగా ఎందుకు మారారు?. వీరి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ రావ‌టానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ఎనిమి సినిమా. ఈ సినిమాలో విశాల్, ఆర్య‌లు త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. చిన్న‌ప్పుడు వీళ్ళ‌కు శిక్షణ ఇచ్చే స‌మ‌యంలో సీబీఐ అధికారిగా ప‌నిచేసిన ప్ర‌కాష్ రాజ్ చెప్పే డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. సినిమా ఫ‌స్టాఫ్ ప‌ర్పెక్ట్ గా ముందుకు సాగుతుంది. సెకండాప్ లో మాత్రం రొటీన్ క‌థే అన్న ఫీలింగ్ వ‌స్తుంది. ఆర్య నెగిటివ్ రోల్ లో త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. మృణాళిని రవి, విశాల్ ల‌వ్ ట్రాక్ కూడా రొటీన్ గా ఉంది..ఏదో పాట‌ల కోసం ఆమెను సినిమాలోకి తీసుకున్న‌ట్లు క‌న్పిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. యాక్షన్ ప్రియులను ఈ సినిమా అలరిస్తుందని చెప్పొచ్చు.

రేటింగ్. 2.5\5

Tags:    

Similar News