ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం

Update: 2020-10-12 04:36 GMT

14న కవిత ప్రమాణ స్వీకారం

నిజామాబాద్ శాసనమండలి ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. ఊహించినట్లే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ఎంపీ కవిత ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లు 823 అయితే..అందులో టీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు 728 ఓట్లు వచ్చాయి. బిజెపికి 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు రాగా, మరో పది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఈ నెల 14న శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జీహెఛ్ఎంసీ చట్టంలో సవరణలు చేసే ఉద్దేశంతో సర్కారు అక్టోబర్ 13న అసెంబ్లీ, అక్టోబర్ 14న శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో కవిత సమావేశాలు జరిగే సమయంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో మొత్తం 824 ఓట్లు ఉండగా, ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం 823 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి నుంచి పి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాస్ రెడ్డి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులు ఇద్దరూ డిపాజిట్లు కోల్పోయారు.

 

 

Tags:    

Similar News