అయినా సరే అప్పటిలో మోడీ దగ్గర వంగి వంగి దండాలు పెట్టారు. విచిత్రం ఏమిటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం మోడీ కి గౌరవం ఇస్తూనే నిటారుగా నిలబడ్డారు తప్ప ఎక్కడా బెండ్ అయిన దాఖలాలు లేవు. ఏ రకంగా చూసుకున్నా కెసిఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ దగ్గర కాన్ఫిడెంట్ గా ఉన్నారనే చెప్పాలి. అదే సమయంలో ప్రధాని అంటే పెద్దన్న అని ...తెలంగాణ కు కేంద్రం పెద్ద ఎత్తున సహకరించాలి అని ఆదిలాబాద్ సభలో మోడీ ని రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అయితే మోడీ ని రేవంత్ రెడ్డి పెద్దన్న అనడంపై బిఆర్ఎస్ రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇద్దరి మధ్య సంబంధాలకు ఇదే నిదర్శనం అని...తెలంగాణకు ప్రధాని ఏమి చేయకపోయినా మోడీ ని పెద్దన్న అనటం పై విమర్శలు చేసింది. గత ప్రభుత్వానికి బిన్నంగా ప్రధాని మోడీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కరెక్ట్ గా ఉంది అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.