జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏమి చేసినా వివాదం అవుతోంది. ఇటీవలే అయన తన ఎన్నికల ప్రచారం కోసం వారాహి వెహికల్ ను సిద్ధం చేయించుకున్నారు. ఈ వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగు ఉండటంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ వాహనాలకు తప్పించి ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటానికి వీలు లేదని నిబంధనలు చెపుతున్నాయి. కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు మరో వివాదం స్టార్ట్ అయింది. అయితే ఈ సారి ఇది సినిమా టైటిల్ కు సంబంధించినది . ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ సినిమా కు సంబంధించి టైటిల్ ప్రకటించారు. ముందు ప్రకటించిన సినిమా టైటిలే మార్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత భవదీయుడు భగత్ సింగ్ పేరు పెట్టాడు.