వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం మూవీ ప్రకటించిన సమయంలోనే అంచనాలు ఒక రేంజ్ కు వెళ్లాయి. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఆక్టోబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా దారుణ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. మూవీ ఒక మోస్తరుగా ఉన్నా కూడా దర్శకుడు త్రివిక్రమ్ గత సినిమాలకు భిన్నంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు పెట్టి ప్రేక్షకులను షాక్ కు గురి చేశాడు. దీంతో ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.
Full Viewఫ్యామిలీ క్రైమ్ డ్రామా మూవీగా తెరెకెక్కిన ఆదర్శ కుటుంబం నవంబర్ 27 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫిల్క్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఇతర కీలక పాత్రల్లో నారా రోహిత్, రావు రమేష్, నివేద పేతురాజ్ లు నటిస్తే ఒక ప్రత్యేక గీతంలో డింపుల్ హయతి హంగామా చేసింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.