'ఉప్పెన' కొత్త పాట విడుదల

Update: 2020-11-11 14:39 GMT

పాటలు ఈ సినిమాకు ఓ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. స్టార్ నటీనటులు ఎవరూ లేకుండానే పాటలతో అంచనాలు క్రియేట్ చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఓ రేంజ్ లో దూసుకెళ్ళగా..ఇప్పుడు చిత్ర యూనిట్ మూడవ పాటను విడుదల చేసింది. సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమానే 'ఉప్పెన'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఉప్పెన సినిమా నుంచి మెలోడి 'రంగులద్దుకున్న'ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, సుకుమార్ కి, వెండితెరకు పరిచయమవుతోన్న వైష్ణవ్ తేజ్‌కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన 'నీ క‌న్ను నీలి స‌ముద్రం', 'ధ‌క్ ధ‌క్ ధ‌క్' పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా 'నీ కళ్లు నీలి సముద్రం' పాట మ్యూజిక్‌ లవర్స్‌ ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియ‌న్ వ్యూస్ దాటింది.

Full View

Tags:    

Similar News