డ్రగ్స్ కేసుకు సంబందించి ప్రముఖ నటి ఛార్మి కౌర్ విచారణ ముగిసింది. ఆమె గురువారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు కోరిన డాక్యుమెంట్లు అన్నీ అందజేశానని..విచారణకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. మరోసారి పిల్చినా విచారణకు హాజరవుతానని వెల్లడించింది.
తనకు సహకరించిన వారి అందరికీ ధన్యవాదాలు తెలిపింది చార్మి. డ్రగ్స్ కేసులో ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తొలుత పూరీ జగన్నాధ్ ను విచారించగా..తర్వాత చార్మి విచారణ పూర్తి చేశారు. ఈడీ విచారణ సందర్భంగా 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను ఈడీ అధికారులు అడిగినట్లు సమాచారం.