విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇదే కావటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ పిరియాడికల్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. చిత్ర యూనిట్ బుధవారం నాడు ఈ మూవీ కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటి అంటే 'ది మమ్మీ' చిత్రంలో 'ఇమ్హోటెప్' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇప్పుడు సర్ థియోడోర్ హెక్టర్ పాత్రతో రణబాలి మూవీలో భాగం అవుతున్నారు.