కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత మంచి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దర్శకుడు పీ ఎస్ మిత్రన్ ఈ సినిమాలో భవిష్యత్ లో జరగబోయే వాటర్ వార్స్..ప్లాస్టిక్ బాటిల్స్ తో నీటి వినియోగం వల్ల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సర్దార్ 2 మూవీ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలం అయింది. సర్దార్ 2 లో కార్తీ తో పాటు మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో స్టైలిష్ విలన్ గా బ్లాక్ డాగర్ పాత్రలో కనిపిస్తాడు.

                                         Full Viewబాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది సర్దార్ 2 ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో ఇది అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తెలుగు తో పాటు తమిళ్,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. సర్దార్ లో మంచి నీళ్ల వ్యాపారం గురించి హై లైట్ చేసిన దర్శకుడు...సర్దార్ 2 లో ప్రముఖంగా బయో వార్స్ గురించిన అంశాలతో మూవీ ని తెరకెక్కించాడు. అయితే ఈ విషయాన్ని ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పటంలో విఫలం కావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

Tags: