మాస్ ఇమేజ్ కోసం హీరో నాని చేసే ప్రయత్నాలపై కొంత మంది పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్యారడైజ్ మూవీ విడుదల అయిన తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఒకప్పుడు నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉండేది...ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండేవి ఆయన సినిమాలు . అయితే గత కొంత కాలంగా హీరో నాని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మాస్ ఇమేజ్ కోసం చేసిన దసరా, సరిపోదా శనివారం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వచ్చిన ది ప్యారడైజ్ మూవీ ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.అయితే నాని కెరీర్ లో ఒక కొత్త రికార్డు కు మాత్రం ఇది కారణం అయింది.

                            Full View ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర నాని అత్యధిక వసూళ్లు అంటే హిట్ 3 మూవీనే. ఈ సినిమా 121 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చెపుతున్నారు. ఇప్పుడు ప్యారడైజ్ అన్ని రికార్డు లను బద్దలు కొట్టి విడుదల అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 155 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే సోమవారం నుంచి బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే థియేట్రికల్ రన్ పూర్తి నాటికీ ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి.

Tags: