నాని హీరో గా నటించిన ప్యారడైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఈ మూవీ పై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ మొదలైంది. అయినా సరే ఈ సినిమా విడుదల అయిన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 136 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆదివారం నాడు కూడా ప్యారడైజ్ మూవీ కి బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే సినిమా 150 కోట్ల రూపాయల మార్క్ ను ఈజీగా దాటనుంది. ఈ సినిమాకు అసలైన సవాలు సోమవారం నుంచే మొదలుకానుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర కీలక సినిమాలు ఏమీ లేకపోవటం కూడా ప్యారడైజ్ కు కొంత కలిసి వచ్చింది. ఈ సినిమాలో ప్రియదర్శి అచ్చం కెసిఆర్ ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో కనిపిస్తాడు.
Full Viewసినిమా విడుదల అయిన దగ్గర నుంచి ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బిఆర్ఎస్ కూడా ప్యారడైజ్ మూవీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం సినిమాకు కొంత కలిసి వస్తోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సినిమా చూసి దీనిపై స్పందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని తో పాటు ప్రియదర్శికి కూడా అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర అమెరికా లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ప్యారడైజ్ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికి 200 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే నాని కెరీర్ లోనే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన ఫస్ట్ మూవీ గా ప్యారడైజ్ రికార్డు లోకి ఎక్కుతుంది.