చనిపోతాననుకున్నా..తమన్నా సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-09 05:56 GMT

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయటానికి రెడీ అవుతున్నారు. కరోనా సమయంలో తాను పడిన ఆందోళనను ఆమె తాజాగా షేర్ చేసుకున్నారు. కరోనా వచ్చిందని తెలిశాక ఎంతో భయపడ్డానని, చికిత్స పొందుతున్న సమయంలో కూడా చనిపోతాననే ఆలోచనలు ఎక్కువగా వచ్చాయన్నారు. అత్యంత కష్టమైన సమయంలో తనకు ధన్నుగా నిలిచిన తల్లిదండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఈ సమయంలోనే జీవితం ఎంతో విలువైనదన తెలిసిందని వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ ఫోటో పెడితే కొంత మంది లావుగా ఉన్నానని కామెంట్ చేశారని, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆ వ్యక్తికి ఏమైంది..ఎలా ఉందో తెలుసుకోకుండానే ఇష్టానుసారం మాట్లాడుతారనే విషయం అర్ధమైందన్నారు. డాక్టర్లు ఇఛ్చిన మందుల వల్లే తాను లావు అయినట్లు తెలిపారు. తనను వైద్యులే బతికించారని..కరోనాకు సంబంధించి తీవ్రమైన లక్షణాలే తనలో కన్పించాయని తమన్నా వెల్లడించారు. ఇప్పుడు తమన్నా పూర్తిగా కోలుకుని షూటింగ్ లకు రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News