Full Viewమహేష్ బాబు అభిమానులకు సోమవారం నాడు పండగే..పండగ. వరస పెట్టి సినిమాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ వచ్చాయి. తొలుత సర్కారు వారి పాట బ్లాస్టర్ రాగా..సాయంత్రానికి మరో బ్లాస్టింగ్ లాంటి వార్త వచ్చింది అధికారికంగా. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుల కాంబినేషన్ లో కొత్త సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా మరోసారి పూజా హెగ్డే సందడి చేయుంది. అంతే కాదు..సినిమా అధికారికంగా ప్రకటించిన రోజే సినిమా విడుదల కూడా ఎప్పుడో చెప్పేశారు. ఈ సినిమా వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్ పతకంపై చినబాబు సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది మహేష్ బాబు 28వ సినిమా. ఖలేజా సినిమా తర్వాత అంటే 11 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా బిజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.