సింగర్ సునీత ఎంగేజ్ మెంట్

Update: 2020-12-07 08:28 GMT

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ సునీత కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పారిశ్రామికవేత్త వీరపునేని రామ్ ను పెళ్ళి చేసుకోబోతున్నారు. సోమవారం నాడే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. 'నా పిల్లలు జీవితంలో చక్కగా స్థిరపడాలని ప్రతి తల్లిలాగానే నేను కోరుకుంటున్నా. నేను కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా.

నా జీవితంలో అలాంటి మధురక్షణాలు ఆసన్నం అయ్యాయి. సంరక్షించే స్నేహితుడిగా, సహచరుడిగా రామ్ నా జీవితంలోకి వచ్చారు. మేమిద్దరం త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాం. ' అని తెలిపారు. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా సునీత పెళ్లిపై రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు సునీత అధికారికంగా ప్రకటించారు.

Tags:    

Similar News