టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సిద్దు లేటెస్ట్ సినిమాలు తెలుసు కదా, జాక్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూశాయి. దీంతో పాటు స్టార్ట్ అయిన కొన్ని ప్రాజెక్ట్ లు కూడా రకరకాల కారణాలతో ఆగిపోయాయి. ఈ తరుణంలో సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా పూజా కార్యక్రమం బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఇది సిద్దు పదవ సినిమా. ఈ సినిమాను అనుమోల్ శర్మ , బన్నీ వాసు, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బి, మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు జీ వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

                                 Full Viewఈ కొత్త సినిమా ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. సిద్దు జొన్నలగడ్డకు జోడిగా ఈ మూవీలో నయన్ సారిక నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉంది. ఈ పూజా కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు...దర్శకులు పాల్గొన్నారు. మరి ఈ కొత్త సినిమాతో అయినా సిద్దు జొన్నలగడ్డ హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Tags: