యూట్యూబ్ ఛాన‌ళ్ళ‌పై స‌మంత కేసు

Update: 2021-10-20 11:15 GMT

ప్ర‌ముఖ‌ హీరోయిన్ స‌మంత క‌న్నెర్ర చేసింది. ఇష్టానుసారం త‌న‌పై క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన యూట్యూబ్ ఛాన‌ళ్ళ‌పై ఆమె కేసులు పెట్టారు. తన పరువు కు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు. మూడు యుట్యూబ్‌ చానల్స్‌తో పాటు ఓ అడ్వకేట్‌పై కూడా సమంత కోర్టులో పిల్ దాఖలు చేశారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు.

సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఇటీవల సమంత, నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్‌, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్‌ వస్తున్నాయి. 

Tags:    

Similar News