అదిరేటి లుక్ లో..ఆర్ఆర్ఆర్ హీరోలు

Update: 2021-12-29 09:15 GMT

ఓ వైపు ఒమిక్రాన్ కేసుల‌తో ప‌లు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తూ ముందుకు సాగుతున్నా ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం వెన‌క‌డుగు వేయ‌టం లేదు. వ‌ర‌స పెట్టి ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్ ప‌నుల్లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తోపాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య‌లు బిజీబిజీగా గ‌డుపుతున్నారు.. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ కేర‌ళ‌లో సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది. తాజాగా త‌మిళ‌నాడులో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని అక్క‌డ‌కు వెళ్లారు. కేర‌ళ‌లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల ఫోటోను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా నిర్మాత దాన‌య్య ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేసే ఆలోచ‌న ఏమీలేద‌ని స్ప‌ష్టం చేశారు.

జ‌న‌వ‌రి 7న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ముంబ‌య్ లో థియేట‌ర్ల‌లో 50 శాతం అక్యుపెన్సీకే అనుమ‌తి ఇవ్వ‌గా..ఢిల్లీలో థియేట‌ర్ల‌ను తాజాగా పూర్తిగా మూసివేశారు. మ‌రో వైపు ఏపీలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల వివాదం న‌డుస్తోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం జ‌న‌వ‌రి 7 నాటికి ఏపీ స‌ర్కారు నుంచి సానుకూల నిర్ణ‌యం వ‌స్తుంద‌ని ధీమాతో ఉంది. అందుకే చిత్ర యూనిట్ మ‌రోసారి వాయిదా ఆలోచ‌న లేకుండా ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News