అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డు !

Update: 2023-02-25 04:59 GMT

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సిఏ ) నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగం తో పాటు నాటు నాటు పాటకు, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్ విభాగంలో అవార్డ్స్ దక్కాయి. ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ ఇప్పటికే అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లు కూడా అక్కడే ఉన్నారు. ఆస్కార్ అవార్డు ల ప్రకటన సమయానికి మరో హీరో ఎన్టీఆర్ కూడా అక్కడకు చేరుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఈ సారి ఆస్కార్ కూడా దక్కుతుంది అనే ధీమాతో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల రూపాయల వసూలు సాధించి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గతం లో ఏ సినిమాకు రాని తరహాలో ఆర్ఆర్ఆర్ కారణంగా దర్శకుడు రాజమౌళి తో పాటు హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కు అంతర్జాతీయంగా కూడా మంచి పాపులారిటీ వచ్చింది అని చెప్పొచ్చు

Tags:    

Similar News