Full Viewఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ సినిమాల్లో రామాయణ ఒకటి. ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ రామాయణ మూవీ లో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుంటే...సీతగా సాయి పల్లవి నటిస్తోంది. గతంలో బయటకు వచ్చిన ఈ సినిమా కంటెంట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల విడుదల అయిన ట్రైలర్ మాత్రం ఈ మూవీ పై అంచనాలను ఒకింత పెంచింది. ముఖ్యంగా ఇందులో రావణుడి పాత్ర పోషించిన హీరో యష్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాడు. కాకపోతే అదే సమయంలో సీత పాత్ర పోషించిన సాయి పల్లవిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా సీత పాత్రకు ఆమె ఏ మాత్రం సరికాదు అంటూ సోషల్ మీడియా లో చాలా మంది పోస్ట్ లు పెట్టారు. మొత్తం మీద రామాయణ ట్రైలర్ ఈ సినిమా విషయంలో ఆశలు సజీవంగానే ఉంచింది అని చెప్పొచ్చు.

                                  చిత్ర యూనిట్ గురువారం నాడు అధికారికంగా రామాయణ సినిమాను ఈ నవంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. గతంలో దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీస్తామని ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇప్పుడు అధికారికంగా విడుదల తేదీని తెలిపారు. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మరో వైపు ఈ సినిమాను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఇందులో రాముడి కథను ఏ మాత్రం వక్రీకరించినా కూడా ఏ మాత్రం సహించేదిలేదు లేదు అంటూ ఢిల్లీ లోని శ్రీరామ్ లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ హెచ్చరించారు. అంతే కాదు..విడుదలకు ముందే తమకు సినిమా చూపించాలని డిమాండ్ చేశారు. లేదు అంటే నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

Tags: