ఇండిగో ఎయిర్ లైన్స్ ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఓ బాలుడిని విమానంలో ఎక్కేందుకు అనుమతించని కారణంగా ఈ ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఇటీవలే ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డె ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడింది. సహజంగా తాను అసలు ఇలాంటి విషయాలపై స్పందించనని..కానీ ఇండిగో6ఈ సిబ్బంది..ముఖ్యంగా విపుల్ నకాషే వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముంబయ్ నుంచి బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగిందని..ఆయన తీరు చాలా దురుసుగా..ఆజ్ణానంతో ఉందని మండిపడింది. ఎలాంటి కారణం లేకుండానే హెచ్చరిక స్వరంతో తమతో మాట్లాడరని పేర్కొంది. ఆయన తీరు భయంకరంగా ఉందని మండిపడింది.