సినిమాల్లో మాత్రం మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. కానీ బయట మాత్రం ఈ మందు చాలా బాగుంటుంది తీస్కోండి అని ప్రమోట్ చేస్తున్నాయి. హీరోలు మందు బ్రాండ్లకు ప్రమోట్ చేయటం ఇంత వరకూ చూశాం. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా రాయల్ ఛాలెంజ్ విస్కీని ప్రమోట్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. అంతే కాదు..ఏ కార్యక్రమంలో అయినా ఇదే మంచి మందు అంటూ..స్మూత్ టేస్ట్ అంటూ మందు గురించి వర్ణన కూడా ఇచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలో ఈ కొత్త బ్రాండు భలే బాగుందంటూ ప్రమోట్ చేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ భామ తర్వాత పలు సినిమాలు చేసినా ఒక్కటీ క్లిక్ కాలేదు.