నిహారిక పెళ్లివేడుకల్లో పవన్..అకీరా సందడి

Update: 2020-12-09 06:39 GMT

నిహారిక పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా చాలా ముందే ఉదయ్ పూర్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్, ఆయన తనయుడు అకీరా కూడా పెళ్ళి వేడుకలకు హాజరయ్యారు. ఈ పెళ్లిలో పవన్, అకీరాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ చేరికతో ఫుల్ ఫ్యామిలీ హాజరైనట్లు అయింది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక చైతన్యల పెళ్ళి జరగనుంది. రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ నిహారిక వివాహ వేడుకకు వేదికగా మారింది. ప్రస్తుతం మెగా బ్రదర్స్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

Tags:    

Similar News