ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుంచి కొత్త అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా ముందు ప్రకటించినట్లు ఈ ఏడాది జూన్ 25 న కాకుండా వచ్చే ఏడాది జూన్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అదే రోజు అంటే మే 20 న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఎన్టీఆర్ న్యూ లుక్ ను విడుదల చేసింది.
అధికారికంగా ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించకపోయినా డ్రాగన్ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్ లో భారీ ఎత్తున కసరత్తులు చేసి సాధించిన న్యూ లుక్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ డేట్ షేర్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి.