ఎన్టీఆర్ చేతి నిండా సినిమాలే

Update: 2021-05-20 08:08 GMT

ఓ వైపు ఆర్ఆర్ఆర్ సినిమా. ఇది కాగానే ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో కలసి మరో సినిమా. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఎన్టీఆర్ 31 వ సినిమా కూడా లైన్ లోకి వచ్చేసింది. కొరటాల శివతో సినిమా ముగించుకున్నాక ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రశాంత్ నీల్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫోటోను షేర్ చేశారు. దీంతో 31వ సినిమా ఇదే అని తేలిపోయింది.

మరో వైపు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా ఉంటుందని గతంలో ప్రకటించారు. మరి బహుశా ఈ సినిమాలు అన్నీ అయిపోయాక అది కూడా తెరపైకి వస్తుందా? లేక మధ్యలో మరికొన్ని ప్రాజెక్టులు జత అవుతాయా అన్నది వేచిచూడాల్సిందే. ఈ లైన్ చూస్తుంటే ఎన్టీఆర్ వచ్చే రెండేళ్ళకు సరిపడా చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నట్లు అయింది.

Tags:    

Similar News