రాబిన్ హుడ్ సెన్సార్ పూర్తి

Update: 2025-03-25 06:49 GMT
రాబిన్ హుడ్ సెన్సార్ పూర్తి
  • whatsapp icon

నితిన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయిన సంగతి తెలిసిందే. మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ మంజారు చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కించుకుంది.

                                             రాబిన్ హుడ్ సినిమా కు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాబిన్ హుడ్ సినిమా టికెట్ రేట్ లు పెంచుకోవటానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టి కలుపుకుని 50 రూపాయలు...,మల్టీప్లెక్స్ ల్లో మాత్రం జీఎస్టీ తో కలుపుకుని 75 రూపాయల మేర రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. విడుదల తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఈ పెరిగిన రేట్లు అమలులో ఉంటాయి. 

Tags:    

Similar News