బాలయ్య ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసిన మైత్రీ మూవీ మేకర్స్ !

Update: 2023-01-17 06:53 GMT

Full Viewసంక్రాంతి సినిమాల లెక్కలు రావటం తో ఫ్యాన్స్ రచ్చ స్టార్ట్ అయింది. నాలుగు రోజులకు బాలకృష్ణ సినిమా గ్రాస్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల రూపాయలు అయితే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వీరసింహారెడ్డి కి థియేటర్స్ తగ్గించటంవల్లే ఈ పరిస్థితి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు. వాస్తవానికి ఫస్ట్ డే వసూలు చూస్తే వాల్తేర్ వీరయ్య కంటే వీరసింహారెడ్డి కల్లెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత లెక్కలు మారాయి. సరైన థియేటర్స్ పడి ఉంటే వీరసింహారెడ్డి కు 140 కోట్లు రావాల్సి ఉంది అని..కానీ థియేటర్లు తగ్గట్గం వాళ్ళ 104 కోట్ల రూపాయల వద్ద ఆగాల్సి వచ్చింది అని నందమూరి ఫ్యాన్స్ ఇన్ వరల్డ్ వైడ్ పేజీ లో అనంతపురం జగన్ ఒక పోస్ట్ పెట్టారు. ఇలాంటి పోస్ట్లు సోషల్ మీడియా లో చాలానే ఉన్నాయి. థియేటర్లు తగ్గించారు అని మైత్రీ మూవీ మేకర్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

                                    వీరసింహారెడ్డి కి పలు కీలక ప్రాంతాల్లో థియేటర్ లు తగ్గటానికి దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా ఒక కారణం అయింది అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. అయినా ఈ రెండు సినిమాలు ఇంకా వారి వారి రేంజ్ లో ఇంకా వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ రెండు సినిమాల వసూళ్ల లెక్కల రచ్చలో అక్కడక్కడా తెలుగు దేశం అభిమానులు కూడా తలో చేయి వేస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు సినిమాల కథల్లో ఎక్కడా పెద్ద కొత్తదనం కానీ..జోష్ కానీ కనిపించవు. కేవలం పండగ సెలవులు...ఆయా పెద్ద హీరోల కున్న ఫ్యాన్స్ బేస్ కారణంగానే ఈ విజయాలు సాధ్యం అయ్యాయనే అంచనాలు ఉన్నాయి. మరో విశేషం ఏమిటి అంటే రెండు సినిమాలు కూడా లాభాల బాటలోకి రావటం ఇక్కడ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు సంతోషం కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత రెండు సినిమాల వసూళ్లు ఎంత అన్నది ఇప్పుడు కీలకం కానుంది.సెలవులు పూర్తి అయినా ఇంకా రెండు సినిమాల వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. 

Tags:    

Similar News