కరోనాకు వ్యాక్సిన్ రాదు..బాలకృష్ణ

Update: 2020-11-16 06:41 GMT

ఓ వైపు ప్రపంచం అంతా కరోనా వ్యాక్సిన్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. అగ్రశ్రేణి ఫార్మా సంస్థలు అన్నీ తమ వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయని..త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని ప్రకటిస్తున్నాయి. ఈ టైమ్ లో ప్రముఖ హీరో, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాలేదు..రాదని అన్నారు. విర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న 'సెహరీ' సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆయన సోమవారం లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. మానసిక క్షోభ లేకుండా ప్రశాంతంగా ఉంటే మనల్ని ఏమీ చేయలేవన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. ఇవాళ నుండి కార్తీక సోమవారం. అయిన సరే తల స్నానాలు చేయవద్దు అని ఆయన సూచించారు. దేవుడిని నమ్ముకోవాలని సూచించారు. అయోధ్యలో బిజెపి రామాలయం కడుతుందని తెలిపారు.

Tags:    

Similar News