బిగ్ బాస్ శనివారం నాటి షోలో హోస్ట్ నాగార్జున ఫైర్ ఛూపించాడు. ముందు కన్ఫెషన్ రూమ్ లో హారికను ఉతికి ఆరేసిన ఆయన..తర్వాత అభిజిత్ సంగతి చూశారు. ఎన్నడూలేని రీతిలో అభిజిత్ పై ఫైర్ అయ్యాడు. అసలు ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి టాస్క్ లు తప్పించుకోవటం..తర్వాత సారీ చెప్పటం ఏంటి ఇది అంతా అంటూ అభిజిత్ తీరును ఎండగట్టాడు. ఏకంగా బిగ్ బాస్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్లు ఓపెన్ చేయించి ఝలక్ ఇచ్చాడు. చివరకు సారీ చెప్పకపోయి ఉంటే బయటకు పంపించేవాడినని హెచ్చరించి..ఎవరి ఆట వాళ్లు ఆడాలని..బిగ్ బాస్ గేమ్ తుది దశకు చేరుకున్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. హారిక, అభిజిత్ ల విషయంలో ఘాటుగా వ్యవహరించిన నాగార్జున తర్వాత తనకు హౌస్ లో ఉన్న అందరిపై అభిమానం ఉందని..గేమ్ కోసమే చెబుతున్నానని క్లారిటీ ఇఛ్చారు. బిగ్ బాస్ హౌస్ లో జలజ ఇచ్చిన టాస్క్ లు అభిజిత్ లైట్ తీసుకున్నాడు. ఆకులు లెక్కలు పెట్టడమా?.
ఇది ఎలా అవుతుంది అని ఓ సారి..మోనాల్ ను ఏడిపించినందుకు అఖిల్, అభిజిత్ ల్లో ఎవరో ఒకరు డేట్ కు తీసుకెళ్ళాలని సూచిస్తుంది. దీనిపై కూడా అభిజిత్ ఫైర్ అవుతాడు. అసలు ప్రతిసారి మోనాల్ బిజినెస్ తనకు పెట్టొద్దని చెబుతున్నా ఎందుకు ఇలా చేస్తారని హారికతో మాట్లాడతాడు. నాగార్జునతో మాట్లాడుతున్న సమయంలో కూడా అభిజిత్ తాను మోనాల్ ను ఏమీ ఏడ్పించలేదని బుకాయిస్తే..నాగార్జున వీడియో ప్రదర్శించి మరి క్లాస్ తీసుకుంటాడు. దీంతో అభిజిత్ మోకాళ్ళపై కూర్చుని మరీ సారీ చెబుతాడు. ఎప్పటిలాగానే శనివారం నాడు మరోసారి మోనాల్ సేవ్ అయింది. ఎలిమినేషన్ లో ఉన్న అవినాష్ ను ఎవిక్షన్ పాస్ ఈ వారం వాడుకుంటావో..వచ్చే వారానికి ఉంచుకుంటావో ఆదివారం చెప్పమంటాడు నాగార్జున.