రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింక్ పబ్ లో రేవ్ పార్టీ జరగటం..అక్కడ డ్రగ్స్ దొరకటంతో కలకలం రేగింది. ఈ పార్టీలో ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ తోపాటు నాగబాబు కుమార్తె నిహారిక, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు సిద్ధార్ధ గల్లా తదితరులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నీహారిక కూడా అక్కడ ఉండటంతో మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన వ్యాఖ్యలు 'గత రాత్రి రాడిసన్ బ్లూ ప బ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించటానికి కారణం నా కూతురు నీహారిక ఆ సమయంలో అక్కడ ఉండటమే.
పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపటం వల్ల పబ్ మీద పోలీసు యాక్షన్ తీసుకున్నారు. నీహారికకు సంబంధించినంత వరకూ షీ ఈజ్ క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నీహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అవసరంలేని, ఊహగానాలకు తావివ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా మనస్సాక్షి చాలా స్పష్టంగా ఉంది. దయచేసి ఎలాంటి ఊహగానాలు ప్రచారం చేయవద్దు' అంటూ నాగబాబు మీడియాను కోరారు.