ఇప్పుడు ప్రభాస్ ఒకవైపు ఆదిపురుష్, సాలార్ తో పాటు ప్రాజెక్ట్ కే (నాగ్ అశ్విన్ ) ప్రాజెక్టులు చేస్తున్నారు. మరి కొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే బాలీవుడ్ కు ఈ మధ్య కాలంలో పఠాన్ వంటి హిట్ దక్కలేదు. ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 634 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఏ హిందీ సినిమాకు ఇటీవల కాలంలో ఇంతటి భారీ వసూళ్లు రాలేదు అని పరిశ్రమ టాక్. పఠాన్ హిట్ తో సిద్దార్ద్ ఆనంద్ కు డిమాండ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. అందులో భాగంగానే మైత్రీ కూడా ఆయనతో ఒక సినిమాకు రెడీ అయింది అని చెపుతున్నారు. ఈ వివరాలు అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.