కేరళ సీఎం చేతికి చెక్కులు

Update: 2024-08-08 14:24 GMT

కేరళ లోని వాయనాడ్ విపత్తుపై స్పందించి మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఆపదలో ఉన్న వాళ్ళను ఆడుకోవటానికి ముందుకు రావటం మంచి పరిణామమే. అయితే చిరంజీవి తాను ప్రకటించిన కోటి రూపాయల సాయం అందించటానికి స్పెషల్ ఫ్లైట్ లో త్రివేండ్రం వెళ్లారు. ఈ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు అంతా ఆయనే భరించుకుంటారు...ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చర్చ అంతా కోటి రూపాయల సాయం అందించటం కోసం ఏకంగా చిరంజీవి ప్రత్యేక విమానం వేసుకుని మరీ కేరళ వెళ్లారు అంటే చేసే సాయం కంటే ప్రచారమే ఎక్కువ కోరుకుంటున్నట్లు ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

                                                    కేరళ వెళ్లిన చిరంజీవి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి చెక్కులు అందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి సీఎం ని అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ లు కోటి రూపాయల సాయం అందిస్తే...అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు, హీరోయిన్ రష్మిక పది లక్షలు, ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News