ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. మే7న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అంటే ఈలోగా ఆయన హైదరాబాద్ వచ్చేస్తారు. మహేష్ బాబు బుదవారం నాడు ఇన్ స్టాలో తాము పారిస్ లో బసచేసిన హోటల్ పేరుతో ఒక ఫోటోను విడుదల చేశారు. సరదాగా ఆ హోటల్ వివరాలు చూద్దామని చూస్తే మహేష్ బాబు బసచేసిన హోటల్ లో రోజుకు అద్దె రెండు లక్షల రూపాయలపైనే ఉంది. ప్రతి టాప్ ట్రావెల్ వెబ్ సైట్ కూడా ఇదే ధరను చూపించింది. మహేష్ బాబుకు అది పెద్ద ధర కాకపోయినా సంపన్నులను సైతం ఇది షాక్ ఇచ్చే ధరే ఇది.