స‌ర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభం

Update: 2020-11-21 10:20 GMT

తాజాగా ఫ్యామిలీతో క‌ల‌సి హాలిడే పూర్తి చేసుకుని వ‌చ్చిన హీరో మ‌హేష్ బాబు ఫీల్డ్ దిగారు. స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా..ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం అయింది.

మహేష్‌ కూతురు ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రతా మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్‌ని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో చిత్రీకరించారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News