'అందరూ నాకే ఓటు వేస్తారు. నేనే గెలుస్తా.' అంటూ ప్రకటించిన బండ్ల గణేష్ అక్మసాత్తుగా రివర్స్ గేర్ వేశారు. జీవితకు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపటం ఇష్టం లేకే తాను ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఆయన చెప్పిన కారణం మెగా ఫ్యామిలీపై గతంలో జీవిత చేసిన విమర్శలే అన్నారు. గత కమిటీలో ఉన్న జీవితకు మళ్లీ అత్యంత కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చే బదులు గత కమిటీనే కొనసాగిస్తే పోతుంది కదా..అసలు ఎన్నికలు ఎందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి బండ్ల గణేష్ శుక్రవారం నాడు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
తాజాగా ఆయన తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 'మా' జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతూ బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేశారు. అకస్మాతు్తగా ఆయన దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది.