జాన్వికపూర్ చెప్పిన సీక్రెట్

Update: 2021-01-15 05:22 GMT

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రహస్యం ఉంటుంది. అలాంటిది సెలబ్రిటీల విషయంలో అలాంటివి ఎన్నో ఉంటాయి. అవి బహిర్గతం చేసినప్పుడు అంతే సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. శ్రీదేవి, బోనీకపూర్ ల కుమార్తె జాన్వి కపూర్ తాజాగా కరీనా కపూర్ నిర్వహించే చాట్ షో 'వాట్ ఉమెన్ వాంట్' కార్యక్రమంలో పాల్గొంది. అక్కడే ఓ సీక్రెట్ వెల్లడించింది.

అది ఏంటి అంటే వాళ్ల నాన్నకు సినిమాకు వెళుతున్నానని చెప్పి లాస్ ఏంజెల్స్ నుంచి బయలుదేరి విమానం ఎక్కి లాస్ వెగాస్ వెళ్లింది. వెగాస్ అంతే తిరిగేసి మళ్ళీ వెనక్కివచ్చేసింది. ఈ విషయాన్ని ఆమె చాట్ షోలో బహిర్గతం చేసింది. లాస్ వెగాస్ క్యాసినోలు, షాపింగ్, నైట్ లైఫ్ కు ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే

Tags:    

Similar News