బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ జాన్వికపూర్ ఆదివారం నాడు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె శనివారం రాత్రే తిరుమల చేరుకుని..ఆదివారం తెల్లవారుజామున వీఐపి బ్రేక్ దర్శనంలో తన స్నేహితురాళ్ళతో కలసి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం జాన్వికపూర్ కు టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అచ్చం తెలుగు అమ్మాయిలా లంగా, ఓణీతో జాన్వికపూర్ శ్రీవారిని దర్శించుకున్నారు. జాన్వికపూర్ తల్లి దివంగత శ్రీదేవి తెలుగులోనూ, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన విషయం తెలిసిందే.